ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(Himachal Pradesh Cricket Association Stadium) వేదికగా జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన గుర్బాజ్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.


అఫ్గానిస్థాన్ జట్టు 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ
(Hashmatullah Shahidi)తో కలిసి గుర్బాజ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 116 పరుగులు జోడించి జట్టుకు మంచి స్కోరును అందించారు.


శాహిదీ ఒక ఎండ్‌లో నిలకడగా ఆడగా, మరో ఎండ్‌లో గుర్బాజ్ భారత బౌలర్లపై బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. చివరకు భారత ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) బౌలింగ్‌లో అవుటయ్యాడు.

51 బంతుల్లో 102 పరుగులు


గుర్బాజ్ కేవలం 51 బంతుల్లో 102 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో తన వన్డే కెరీర్‌లో 9వ శతకాన్ని నమోదు చేశాడు. ఇప్పటివరకు 53 వన్డేల్లో 1,990 పరుగులు చేసిన గుర్బాజ్ సగటు 38.26గా ఉంది. ఇందులో 9 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. భారత్‌పై ఆడిన రెండు వన్డేల్లో అతడు 123 పరుగులు చేసి 61.50 సగటును నమోదు చేశాడు. 48 బంతుల్లో శతకం పూర్తి చేసిన గుర్బాజ్, భారత్‌పై వన్డేల్లో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

భారత్‌పై అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీలు


షాహిద్ అఫ్రిది – 45 బంతులు (2005)
రహ్మానుల్లా గుర్బాజ్ – 48 బంతులు (2026)
జేమ్స్ ఫాల్క్‌నర్ – 57 బంతులు
ఏబీ డివిలియర్స్ – 57 బంతులు
మైఖేల్ బ్రేస్‌వెల్ – 57 బంతులు

అఫ్గానిస్థాన్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ


ఈ మ్యాచ్‌లో చేసిన 48 బంతుల శతకంతో గుర్బాజ్ అఫ్గానిస్థాన్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా చరిత్ర సృష్టించాడు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *