న్యూజిలాండ్‌(New Zealand) స్టార్‌ క్రికెటర్‌ కేన్‌ విలియమ్సన్‌(Kane Williamson) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఆటకు వీడ్కోలు చెప్పడానికి ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు. 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో విలియమ్సన్‌ అన్ని ఫార్మాట్లలో కలిపి 378 మ్యాచ్‌లు ఆడారు. ఈ కాలంలో ఆయన 19,346 పరుగులు సాధించి న్యూజిలాండ్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా నిలిచారు.


విలియమ్సన్‌ ఖాతాలో మొత్తం 48 సెంచరీలు, 6 డబుల్‌ సెంచరీలు ఉన్నాయి. టెస్టు క్రికెట్‌లో ఆయన 33 శతకాలు నమోదు చేయగా, వన్డేల్లో 175 మ్యాచ్‌లు ఆడి 7,256 పరుగులు చేశారు. ఇందులో 15 సెంచరీలున్నాయి. తన అద్భుతమైన బ్యాటింగ్‌ ప్రదర్శనలతో ఎన్నో చిరస్మరణీయ విజయాలను జట్టుకు అందించిన విలియమ్సన్‌ రిటైర్మెంట్‌తో న్యూజిలాండ్‌ క్రికెట్‌లో ఒక స్వర్ణయుగానికి ముగింపు పలికినట్టైంది.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *