Ganja Smuggling in Train: తుని రైల్వేస్టేషన్లో గంజాయి పట్టివేత.. చాక్లెట్ల రూపంలో తరలింపు
Ganja Smuggling in Train: తుని రైల్వేస్టేషన్లో గంజాయి పట్టివేత.. చాక్లెట్ల రూపంలో తరలింపు
Ganja Smuggling in Train: తుని రైల్వేస్టేషన్లో గంజాయి పట్టివేత.. చాక్లెట్ల రూపంలో తరలింపు
రైలులో చాక్లెట్ల రూపంలో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. తుని రైల్వేస్టేషన్లో హావ్డా-చెన్నై రైలులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకులపై పోలీసులు నిఘా పెట్టారు.
అనుమానం రావడంతో వారి బ్యాగులను తనిఖీ చేయగా.. చాక్లెట్ల రూపంలో ప్యాక్ చేసిన గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. దీంతో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టైన వారిని మనోజ్ ప్రధాన్, శంబునాథ్, అజయ్గా పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి, గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే అంశాలపై దర్యాప్తు చేపట్టారు.
రైలులో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.