వర్షాకాలం తీసుకొచ్చే పచ్చని ప్రకృతి, జలపాతాలు, తడి నేల సువాసనలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. అయితే, మారే వాతావరణం, అధిక తేమ, నీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల ట్రావెలింగ్ కాస్త సవాలుగా మారవచ్చు. ఈ మాన్సూన్లో మీరు దూర ప్రయాణాలు లేదా రోడ్ ట్రిప్‌లు ప్లాన్ చేస్తుంటే, ఆరోగ్యంగా ఉంటూ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడానికి ఈ ఆచరణాత్మక చిట్కాలు పాటించండి:
1. ఆహారం & మంచి నీటి విషయంలో జాగ్రత్తలు:
- వేడివేడి ఆహారం: ఆవిర్లు కక్కే ఫ్రెష్‌గా వండిన పదార్థాలనే తినండి. రోడ్డు పక్కన అమ్మే పదార్థాలు, పచ్చి కూరగాయలు, ఓపెన్ బఫేలలోని చల్లని ఆహారానికి దూరంగా ఉండటం మేలు.
- సురక్షితమైన తాగునీరు: సీల్ చేసిన మినరల్ వాటర్ లేదా కార్బోనేటెడ్ పానీయాలనే ఎంచుకోండి. ఐస్ క్యూబ్స్ వేసిన జ్యూస్‌లు, కుళాయి నీటిని అస్సలు తాగవద్దు.
- పండ్లు: మీరు స్వయంగా తొక్క తీసి వెంటనే తినగలిగే తాజా పండ్లను మాత్రమే తీసుకోండి.
2. వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్ వాడకం:
- మబ్బుగా ఉన్నప్పటికీ ప్రమాదకర UV కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి.
- వర్షాకాలం కోసం ప్రత్యేకంగా జిడ్డు లేని జెల్-ఆధారిత (Gel-based) మరియు వాటర్-రెసిస్టెంట్ సన్‌స్క్రీన్ వాడండి.
- బయట తిరుగుతున్నప్పుడు ప్రతి 3 గంటలకొకసారి దీన్ని మళ్లీ అప్లై చేసుకోండి.
3. లైట్ మేకప్ & స్కిన్ కేర్:
- తేమ ఎక్కువగా ఉండటం వల్ల హెవీ మేకప్ వర్షంలో లేదా చెమటకు కారిపోయే అవకాశం ఉంది.
- బరువైన క్రీమ్‌లకు బదులుగా లైట్‌వెయిట్ సీరమ్‌లు లేదా జెల్ మాయిశ్చరైజర్లు వాడండి.
- ఫౌండేషన్‌కు బదులుగా BB లేదా CC క్రీమ్‌లు వాడి మినిమల్ లుక్ సాధించవచ్చు.
4. ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ:
వర్షాకాలంలో పాదాలు, చర్మం తడవటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం సహజం. వాటి నివారణకు:
- కొబ్బరి నూనె: చర్మంపై శుభ్రమైన కొబ్బరి నూనె రాయడం వల్ల ఇది సహజ యాంటీ-ఫంగల్ కవచంగా పనిచేస్తుంది.
- వేప నీరు/నూనె: వేప ఆకులు ఉడకబెట్టిన నీటితో పాదాలను కడగడం లేదా వేప నూనెను ఇన్ఫెక్షన్ ఉన్న చోట రాసి 30 నిమిషాల తర్వాత కడిగితే మంచి ఫలితం ఉంటుంది.
5. ట్రావెల్ కిట్ – తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులు:
- రేయిన్కోట్ & గొడుగు: మంచి నాణ్యత గల రెయిన్‌కోట్, గొడుగును ఎప్పుడూ మీ బ్యాగ్‌లో సిద్ధంగా ఉంచుకోండి.
- వాటర్‌ప్రూఫ్ షూస్ & సాక్స్: జారకుండా ఉండే గ్రిప్ ఉన్న వాటర్‌ప్రూఫ్ స్నీకర్లు, నీరు చొరబడని సాక్స్ మీ పాదాలను పొడిగా ఉంచుతాయి.
- పరిమళభరిత వైప్స్: ప్రయాణంలో తేమ, చెమట వల్ల వచ్చే దుర్వాసనను పోగొట్టుకోవడానికి వెట్ వైప్స్ దగ్గర ఉంచుకోండి.
చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే, మీ వర్షాకాల ప్రయాణం సురక్షితంగా, ఆహ్లాదకరంగా మారుతుంది!
