Techmahindra employee: ఆఫీసులోవేధింపులుఅనారోగ్యంతో లీవ్ పెడితే ఉద్యోగం
హైదరాబాద్‌లోని టెక్ మహీంద్ర (Tech Mahindra) సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భావన అనే మహిళా ఉద్యోగిని, కంపెనీ యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు. అనారోగ్య కారణాల వల్ల సెలవు తీసుకున్నందుకు తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని, కంపెనీలో తీవ్రమైన మానసిక వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలు తెలిపిన ప్రధాన ఆరోపణలు:
- సెలవుల వేధింపులు: తనకు, తన చిన్నారికి ఆరోగ్యం బాగోలేక మెడికల్ రిపోర్టులతో సహా ముందస్తు సమాచారం ఇచ్చి లీవ్ తీసుకున్నప్పటికీ.. విశ్రాంతి సమయంలో వరుస ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్‌తో వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
- ముందస్తు నోటీసు లేకుండానే డిస్మిస్: ఎలాంటి ముందస్తు నోటీసు లేదా వివరణ కోరకుండానే తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించారు.
- వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా పర్మిషన్ తప్పనిసరి: ఆఫీసులో కనీసం వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని, ఇది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని మండిపడ్డారు. మహిళా ఉద్యోగులకు కుటుంబం, పిల్లల సంరక్షణ వంటి బాధ్యతలు ఉంటాయని, కార్పొరేట్ సంస్థలు మానవత్వంతో వ్యవహరించాలని కోరారు.
ధర్నా & విచారణ:
పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం బాధితురాలు భావన టెక్ మహీంద్ర ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.
కాగా, ఈ తీవ్ర ఆరోపణలపై టెక్ మహీంద్ర యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఈ ఘటనతో ఐటీ రంగంలో వర్క్ కల్చర్ (Work Culture), ఉద్యోగుల హక్కులపై మళ్లీ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
