మరో కొద్ది రోజుల్లో జూలై నెల ముగిసి ఆగస్టు ప్రారంభం కానుంది. కొత్త నెలలోకి అడుగుపెడుతున్న వేళ బ్యాంకింగ్ పనులు ఉన్నవారికి ముఖ్యమైన అలర్ట్! ఆగస్టు నెలలో పండుగలు, వారాంతపు సెలవులు (ఆదివారాలు, రెండవ & నాల్గవ శనివారాలు) కలిపి మొత్తం 9 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
అత్యవసర బ్యాంకింగ్ లావాదేవీలు ఉన్నవారు ఈ సెలవుల జాబితాను చూసుకుని ముందే తమ పనులను ప్లాన్ చేసుకోవడం మంచిది.
ఆగస్టు 2026 బ్యాంక్ సెలవుల జాబితా:
- ఆగస్టు 02 (ఆదివారం): వారంతపు సెలవు
- ఆగస్టు 08 (రెండవ శనివారం): బ్యాంక్ సెలవు
- ఆగస్టు 09 (ఆదివారం): వారంతపు సెలవు
- ఆగస్టు 15 (శనివారం): స్వాతంత్ర్య దినోత్సవం (జాతీయ సెలవు)
- ఆగస్టు 16 (ఆదివారం): వారంతపు సెలవు
- ఆగస్టు 22 (నాల్గవ శనివారం): బ్యాంక్ సెలవు
- ఆగస్టు 23 (ఆదివారం): వారంతపు సెలవు
- ఆగస్టు 25 (మంగళవారం): మిలాద్-ఉన్-నబీ
- ఆగస్టు 30 (ఆదివారం): వారంతపు సెలవు
సెలవు రోజుల్లో డిజిటల్ సేవలు లభ్యం:
శాఖలు మూసివేసి ఉన్నప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి:
- ఏటీఎం (ATM) సేవలు యథావిధిగా పనిచేస్తాయి.
- UPI (PhonePe, Google Pay, PayTM మొదలైనవి) లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
- నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ల ద్వారా నగదు బదిలీ లేదా ఇతర సేవలను అంతరాయం లేకుండా పొందవచ్చు.
